రెండు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం

రెండు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం

VKB: వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో మెయిన్ లైన్ పగిలిన కారణంగా రెండు రోజులపాటు మిషన్ భగీరథ తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని గ్రిడ్ ఈఈ చల్మారెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న నవాబ్‌పేట మండలం, తాండూర్ నియోజకవర్గంలో ఉన్న పెద్దముల్ మండలాలకు కూడా అంతరాయం ఉంటుందని అన్నారు. ప్రజలు తాగు నీటిని పొదుపుగా వాడుకుంటూ సహకరించాలని కోరారు.