బస్సులో మద్యం సీసాలు స్వాధీనం

VZM: మెంటాడ మండలం లోతుగెడ్డకి చెందిన వ్యక్తి నుంచి సోమవారం 30 మద్యం సీసాలను ఆండ్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు మెంటాడ నుంచి బస్సులో మద్యం సీసాలు తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పిట్టాడ చెక్ పోస్టు వద్ద బస్సు ఆపి తనిఖీ చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి ఆండ్ర పోలీసు స్టేషన్‌కు తరలించారు.