భక్తులను కాపాడాలని ఎమ్మెల్యే బొజ్జల ఆదేశం
TPT: ఏర్పేడు మండలం బత్తినయ్య కోనలో ఇరుక్కున్న భక్తులను కాపాడాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎవరికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మార్వో భార్గవి, ఎంపీడీవో సౌభాగ్యమ్మకు సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని ఆదేశించారు.