నారాయణరావుపేటలో 89.29% పోలింగ్
SDPT: నారాయణరావుపేట మండలంలో రెండో విడత స్థానిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ముగిసే సమయానికి ఏకంగా 89.29% ఓటింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం13,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో గంటలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మండలంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.