టీమిండియాను ఓడిస్తాం: కేశవ్ మహారాజ్

టీమిండియాను ఓడిస్తాం: కేశవ్ మహారాజ్

భారత్-సౌతాఫ్రికా మధ్య ఈనెల 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను భారత్‌లో ఓడించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత సులభం కాదనే విషయం తమకు తెలుసని చెప్పాడు. ఈ సిరీస్ తమకు పెద్ద పరీక్షే అని వ్యాఖ్యానించాడు.