కుక్కల సంరక్షణ కేంద్రాన్ని తరలించాలని వినతి

కుక్కల సంరక్షణ కేంద్రాన్ని తరలించాలని వినతి

KMM: 9వ డివిజన్లో ఉన్న కుక్కల సంరక్షణ కేంద్రాన్ని జనావాసాల నుంచి తొలగించి ఊరు బయట అనుకూలమైన ప్రదేశానికి తరలించాలని BJP జిల్లా నాయకులు కుమిలి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం KMC కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిసి వినతిపత్రం అందజేశారు. కుక్కల సంరక్షణ కేంద్రం వల్ల గత కొన్ని నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.