VIDEO: కూలిన మట్టి మిద్దె.. తప్పిన ప్రమాదం

ప్రకాశం: కొమరోలులో శనివారం ఆకస్మాత్తుగా ఓ మట్టి మిద్దె కూలిపోయింది. ఉన్నట్టుండి మిద్దె ముందుభాగం కూలిపోవటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు తెలిపారు. రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి మిద్దె పూర్తిగా నానిపోయి కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.