జిల్లాలో మూడు రోజులు పాటు వర్షాలు

జిల్లాలో మూడు రోజులు పాటు వర్షాలు

కృష్ణా: సముద్ర తీర జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో కోస్తా తీరం వెంబడి తుఫానులు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 2.88 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కాగా, శనివారం సాయంత్రానికి 2.41 లక్షల క్యూసెక్కులు చేరాయి.