గాయాలతో అడవిని వీడి.. జనారణ్యంలోకి జింక!
PLD: సత్తెనపల్లిలోని సుందరయ్య కాలనీ రోడ్డుపై ఓ జింక ప్రత్యక్షమైంది. తలకు తీవ్ర గాయాలవడంతో అది కదలలేని స్థితిలో ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఎండల తీవ్రతకు నీటి కోసం వెతుకుతూ జింక జనవాసాల్లోకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అడవుల్లో మూగజీవాల కోసం నీటి వసతి కల్పించాలని జంతు ప్రేమికులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.