ఎండల తీవ్రత.. ఎంజీయూలో ఒంటిగంట వరకే తరగతులు

ఎండల తీవ్రత.. ఎంజీయూలో ఒంటిగంట వరకే తరగతులు

నల్గొండ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎంజీయూ పరిధిలోని కళాశాలల పనివేళలను మారుస్తున్నట్లు వీసీ హుస్సేన్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. పీజీ నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మే 15 వరకు తరగతులు పూర్తి చేసి, వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.