'నా రాజకీయ ప్రస్థానంలో శాయంపేటకు ప్రత్యేక స్థానం'

'నా రాజకీయ ప్రస్థానంలో శాయంపేటకు ప్రత్యేక స్థానం'

HNK: శాయంపేట (M) తమకు ఎప్పటికీ గుండెకాయ లాంటిదని మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలానికి చెందిన అడ్వకేట్ విజయపాల్ రెడ్డి తల్లి అహల్యమ్మ మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి మృతురాలికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ రాజకీయ ప్రస్థానంలో శాయంపేటకు ప్రత్యేక స్థానం ఉందని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గం మారినా, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదని పేర్కొన్నారు.