తీగలపల్లి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తీగలపల్లి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

MBNR: జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం తీగలపల్లి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆశన్న మాట్లాడుతూ.. ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆ దేవుడి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు.