బాధితునికి మొబైల్ ఫోన్ అప్పగింత

బాధితునికి మొబైల్ ఫోన్ అప్పగింత

NZB: రుద్రూర్ మండలానికి చెందిన ఎం. గోపాల్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు ఎస్సై సాయన్న శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో బాధితునికి ఫోన్‌ను తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా సత్వర సేవలు అందించిన ఎస్సై, పోలీసు సిబ్బందికి గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.