పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన

పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. హాస్టల్ నుంచి ర్యాలీగా రిజిస్ట్రార్ కార్యాలయంకు చేరుకున్న విద్యార్థులు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూనివర్సిటీ వీసీ వచ్చి తమ సమస్యకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.