హెల్మెట్ ధారణపై పోలీసుల ర్యాలీ

హెల్మెట్ ధారణపై పోలీసుల ర్యాలీ

BPT: చీరాలలో "శిరో రక్ష-ప్రాణ రక్ష" పేరిట పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా హెల్మెట్ ధరించి పాల్గొన్నారు. ఆయనతో పాటు 150 మంది సిబ్బంది హెల్మెట్లతో ర్యాలీలో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణకే అందరూ హెల్మెట్ వాడాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.