ఎమ్మెల్యే కార్యాలయంలో వినతుల స్వీకరణ

ఎమ్మెల్యే కార్యాలయంలో వినతుల స్వీకరణ

CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయం ప్రజాదర్బార్‌లో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వినతులు స్వీకరించారు. ప్రజలు అందించిన అర్జీలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు. వివిధ సమస్యలపై మొత్తం 11 అర్జీలు వచ్చాయన్నారు.