VIDEO: రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెడన నియోజకవర్గం బంటుమిల్లి రోడ్డు నుండి గుడివాడ వెళ్లే రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు రహదారులకు పూర్వ వైభవం తెచ్చేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, పాల్గొన్నారు.