నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
SKLM: ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అప్పలనారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 40 శాతం దాటిన దివ్యాంగులందరికీ ఈ పథకం వర్తింపచేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు సంవత్సరాలకు ఒక పాస్‌ను పొందవలసి ఉంటుందన్నారు.