సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సహాయ కమీషనర్

VZM: మున్సిపల్ సహాయ కమీషనర్ కె.అప్పలరాజు బుధవారం పట్టణంలోని 33, 48, 49వ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను విధింపు ప్రక్రియలు ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు. పన్ను పరిధిలోకి రాని ఆస్తి వివరాల నమోదు, అదనపు నిర్మాణాలపై పన్ను విధింపు ప్రక్రియలు ఏలా చేపడుతున్నారన్న విషయాలను గమనించారు.