గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

BDK: జిల్లాలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బూర్గంపహాడ్ మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. 10 పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని అభినందించి, ప్రశంసించారు. అనంతరం ఉపాధ్యాయులు కలెక్టర్‌కి శాలువాతో సన్మానం చేశారు. పాఠశాల పరిసరాలను, ఇంకుడుగుంతలను పరిశీలించి గడ్డ పార చేతపట్టి మట్టితవ్వక కార్యక్రమంలో పాల్గొన్నారు.