భద్రకాళి అమ్మవారి సేవలో హీరో ఆది సాయికుమార్
WGL: వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రముఖ నటుడు ఆది సాయికుమార్ గురువారం దర్శించుకున్నారు. ముందుగా వల్లభ గణపతిని, అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి శేషు ప్రత్యేక పూజలు నిర్వహించగా, దేవస్థానం తరఫున అమ్మవారి శేష వస్త్రాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త తోను పూనూరి వీరన్న, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు