నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కృష్ణా: APSSDC ఆధ్వర్యంలో గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నారు. 3 నెలల కస్టమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోర్సుకు నిర్వాహకులు దరఖాస్తులు కోరారు. పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన 16-35 ఏళ్ల యువత అర్హులని పేర్కొన్నారు. ఆధార్ జిరాక్స్, ఫోటోతో స్కిల్ హబ్‌ను సంప్రదించాలన్నారు.