జిల్లాలో 59వ రోజు కొనసాగుతున్న నిరాహార దీక్ష

జిల్లాలో 59వ రోజు కొనసాగుతున్న నిరాహార దీక్ష

KRNL: ఆదోని జిల్లా కోసం మంగళవారం 59రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా సాధన కమిటీ (జేఏసీ) సభ్యులు ప్రకాష్, పాండురంగ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. జిల్లా ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.