VIDEO: పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించిన CP
హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులో వరంగల్ పోలీస్ రేంజ్ నూతన పరిపాలన కార్యాలయ భవనాన్ని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. నూతన భవనంలో ఇకపై రేంజ్ పరిధిలోని అన్ని పోలీస్ అధికారుల శాఖాపరమైన కార్యకలాపాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCP అంకిత్ కుమార్, DSPలు తదితరులు ఉన్నారు.