ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఆటో
PLD: వినుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సును యర్రగొండపాలెం సమీపంలో ఆటో ఢీకొట్టింది. మంగళవారం యర్రగొండపాలెం నుంచి వినుకొండ వస్తున్న బస్సును గొల్లవిడుపు వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.