దారుణం.. భర్త చేతిలో భార్య హతం

SKLM: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోటబొమ్మాళిలో భర్త చేతిలో భార్యహతం అయ్యింది. కోటబొమ్మాళిలో నివాసముంటున్న ఎన్.లక్ష్మీ(35) అనే మహిళను తన భర్త తిరుపతిరావు బుధవారం సాయంత్రం హత్య చేశాడు. గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భార్య గొంతు కోసి హత్యకు పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.