పవన్ కళ్యాణ్ అండ అనాధ పిల్లలకు చేయూత

KKD: పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది అనాధ పిల్లలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన జీతం నుంచి రూ. 2.10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ఒక్కో బిడ్డకు రూ. 5 వేల చొప్పున ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో పంపించారు. పవన్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం పిల్లల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు.