ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే
BPT: బాపట్ల పట్టణంలోని నాయుడు పాఠశాల వద్ద శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. పేదల అండగా, బలహీన వర్గాల ఆదరణగా ఎన్టీఆర్ భరోసా పథకం నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.