పెద్దహరివనం మండలం ఏర్పాటుపై ప్రతిపాదన
KRNL: ఆదోని మండల పునర్విభజన ఖాయమైంది. కొత్తగా పెద్దహరివనం మండలం ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు నేడు మరోసారి మంత్రులు, అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం 42 గ్రామాలతో ఒకే మండలంగా ఆదోని నియోజకవర్గం ఉంది.