VIDEO: దెబ్బతిన్న రహదారి.. ప్రజలకు ఇబ్బందులు
NDL: బేతంచెర్ల మండలం బలపాలపల్లి, పాపసాని కొట్టాల, తవిసికొండ గ్రామాలకు వెళ్లే రహదారి దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా నిత్యం మండల కేంద్రానికి రాకపోకలు సాగుతున్నాయి. రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారి ఇవాళ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.