గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: రూపేష్ రెడ్డి

గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: రూపేష్ రెడ్డి

ADB: గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. బేల మండలంలోని సదలపూర్ గ్రామంలో వీవో భవనానికి సర్పంచ్ మంగేష్‌తో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.