గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

చిత్తూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం జరిగిన గంగమ్మ జాతరల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. చిత్తూరు నగర పాలక పరిధిలో ఇరువారం, ప్రశాంత్ నగర్, 190 రామాపురంలో ప్రతిష్టించిన గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, హారతులు ఇచ్చి పూజలు చేశారు.