VIDEO: గోవుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు

ELR: నూజివీడు పట్టణ పరిధిలో గోవుల సంచారం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో గురువారం తెల్లవారుజామున గోవుల గుంపులు సంచరించడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు వాపోయారు. యజమానులకు నోటీసులు ఇచ్చి, గోవులను రోడ్లపై సంచరించకుండా చూడాలని ప్రజలు కోరారు.