వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రెడ్‌బుక్ రాజకీయాలు ఆపాలని అన్నారు. మీకు రెడ్‌బుక్ ఉంటే.. మాకు డిజిటల్ బుక్ ఉందని చెప్పారు. తాడిపత్రిలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు.