మాక్లూర్​ సొసైటీలో అక్రమాలను నిరసిస్తూ సభ్యుల ధర్నా

మాక్లూర్​ సొసైటీలో అక్రమాలను నిరసిస్తూ సభ్యుల ధర్నా

NZB: మాక్లూర్​ సొసైటీలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు రైతులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం సొసైటీ ఎదుట రైతులు సభ్యులు ధర్నాకు దిగారు. సొసైటీలో అక్రమాలకు పాల్పడుతున్న బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. రూ.కోట్లల్లో రైతుల సొమ్ము దోపిడీ జరిగినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహించారు.