బాసర దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా శ్రీనివాస్
NRML: బాసర సరస్వతి అమ్మవారి దేవస్థానం సహాయ కార్యనిర్వాహణాధికారిగా జి. శ్రీనివాస్ నియమితులయ్యారు. కొమురవెల్లి ఆలయంలో పనిచేస్తున్న ఆయన బాసరకు బదిలీ అయ్యారు. బాసరలో పనిచేస్తున్న AEO సుదర్శన్ గౌడ్ కొమురవెల్లి దేవస్థానానికి బదిలీ అయ్యారు. వీరిద్దరూ ఐదు సంవత్సరాల కిందట బదిలీపై బాసరకు, కొమురవెల్లికి రాగా ఇన్నాళ్లకు మాతృ సంస్థలకు బదిలీ అయ్యారు.