సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించి అక్కడికి సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో బాధ్యతాయుతంగా మాట్లాడడంతో పాటుగా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. పలువురు సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.