కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని 61 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ రాజ్ కుమార్, పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్,ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు పాల్గొన్నారు.