'భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఇఫ్తార్ విందు'
NRML: కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీవోల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇలాంటి వేడుకలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలని తెలిపారు. అధికారుల మధ్య సత్సంబంధాలు పెరిగితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని అన్నారు.