హోంగార్డుపై దాడి.. ఏఎస్ఐపై చర్యలకు ఆదేశం

KRNL: నగరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హోంగార్డుపై దురుసుగా ప్రవర్తించి దాడికి దిగాడు. శుక్రవారం ఫోటో తీసే విషయంపై ఘర్షణ చెలరేగి, హోంగార్డుపై ఏఎస్ఐ దాడి చేయడంతో మూడు పళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై స్పందించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏఎస్ఐపై విచారణ జరిపించాలని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.