సీపీకి ధన్యవాదాలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ
HYD: బషీరాబాద్ సీసీఎస్ కార్యాలయం ముందు HYD సీపీ సజ్జనార్ చిత్రపటానికి ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు పాలాభిషేకం చేశారు. ఫౌండేషన్ ఆస్తులను విక్రయించి, బాధితులకు న్యాయం చేయాలన్న హైకోర్టు ఆదేశాలను వారు స్వాగతించారు. పోలీసుల సత్వర దర్యాప్తు వల్లే తమకు న్యాయం జరుగుతోందని హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. సీసీఎస్ కార్యాలయం వద్ద బాధితులు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.