'సౌరశక్తి వినియోగంతో ఖర్చులు తగ్గించుకోవచ్చు'

'సౌరశక్తి వినియోగంతో ఖర్చులు తగ్గించుకోవచ్చు'

WGL: కలెక్టర్ కార్యాలయంలో బుధవారం PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవచ్చని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.