VIDEO: జిల్లాలో పెరిగిన చలి.. వణుకుతున్న ప్రజలు
NZB: జిల్లాలో విపరీతమైన చలి పెరగడంతో వర్ని మండలం వణుకుతుంది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు జలాల్ పూర్, సిద్దాపూర్, జాకోరా, కూనీపూర్, తగిలేపల్లి గ్రామాల్లో ఉదయం 6గం.ల వరకు కూడా ఎవరు బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే చలి ఈ స్థాయిలో ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.