బేగంపేటలో భారీ ట్రాఫిక్ జామ్.. వాహనాలు తరలింపు

బేగంపేటలో భారీ ట్రాఫిక్ జామ్.. వాహనాలు తరలింపు

HYD: బేగంపేట్ బస్టాప్ వద్ద భారీ లోడ్‌తో వస్తున్న ట్రక్, థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ వాహనాలు ఇంకా రోడ్డుపై ఉండడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు వాహనాలను అక్కడి నుంచి నెమ్మదిగా తరలించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.