హామీలు గాలికి… కాంగ్రెస్‌పై విమర్శలు
JGL: వెల్గటూర్ మండలం రాంనూర్‌లో BRS నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడు చల్లూరి రాంచంద్రం గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా అయిత సుమన్ (రాకేష్), ప్రధాన కార్యదర్శిగా బిడారి సత్తయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.