VIDEO: కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎంఈవో
ప్రకాశం: కంభం మండలం రావిపాడులో కూలిన ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు మట్టి మిద్దెగా ఉన్న స్కూల్ భవనం కూలిందనీ ముందస్తు హెచ్చరికలు చేస్తూ, పాఠశాలలకు సెలవు ప్రకటించినందున ఎవరికి ఎటువంటి హాని జరగలేదని ఆయన తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా శుక్రవారం నుండి అద్దె భవనంలో పాఠశాల కొనసాగించాలన్నారు.