VIDEO: రాయదుర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

VIDEO: రాయదుర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

ATP: రాయదుర్గం పట్టణంలోని టీచర్స్ కాలనీలో రెండు చోట్ల రూ. 7.2 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భూమిపూజ చేశారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, డీఈ సురేశ్, ఏఈ నర్సింహులు, టీడీపీ నేత బండి కృష్ణమూర్తితో కలిసి పనులు లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.