'పెన్షన్ దారుల మహా గర్జన సదస్సును జయప్రదం చేయండి'

KMM: ఈనెల 30న బోనకల్లో నిర్వహించే పెన్షన్ దారుల మహా గర్జన సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్, MSP నాయకులు అన్నారు. ఆదివారం తూటికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం గ్రామాల్లో పెన్షన్ దారులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.