భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

గ్రీస్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. భూకంపకేంద్రం భూఉపరితలం నుంచి 83కి.మీ లోతులో ఉంది. ఈ భూకంపం ప్రభావంతో ఈజిప్టు, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.