VIDEO: 'నర్సంపేటలో టోల్ ఫీజును నిలిపివేయాలి'
WGL: నర్సంపేటలోని NH 365 జాతీయ రహదారిపై మరమ్మతు పనులు కొనసాగుతున్నప్పటికీ రోడ్డు దెబ్బతిన్న స్థితిలో ఉంది. గుంతలు, అసమాన మార్గం కారణంగా వాహనాలు తీవ్రంగా కుదుపుకు గురవుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాల భయంతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సరిగా లేనప్పటికీ టోల్ వసూళ్లు యథావిధిగా కొనసాగుతున్నాయని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.